Site icon NTV Telugu

YS Jagan: ఢిల్లీకి బయలుదేరిన మాజీ సీఎం జగన్

Jagan

Jagan

YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో ఏపీలో జరుగుతున్న హింసాకాండకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేయనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే జగన్‌ ఉండనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్‌ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్‌ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. రేపటి ధర్నాలో హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించాలని వైసీపీ నిర్ణయించింది.

Read Also: Tirumala Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ దర్శన టికెట్లు విడుదల

 

 

Exit mobile version