Site icon NTV Telugu

Konda Lakshma Reddy: మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

Konda Lakshma Reddy

Konda Lakshma Reddy

Konda Lakshma Reddy: కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నింపుతూ.. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

IND vs AUS: వన్డే చరిత్రలోనే అతిపెద్ద ఛేజ్.. టాప్ 5లో నాలుగు రికార్డులు ఆస్ట్రేలియావే!

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేగా సుపరిచితులైన కొండా లక్ష్మారెడ్డి, న్యూస్ అండ్‌ సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స ఫలించక మరణించారు. జర్నలిజంపై ఆయనకున్న మక్కువతో 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను స్థాపించారు. జర్నలిస్ట్ హక్కుల కోసం కృషి చేసిన ఆయన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

నేడే విడుదల.. 200MP కెమెరా, కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చేస్తున్న Vivo X300, Vivo X300 Pro స్మార్ట్ఫోన్స్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన కొండా లక్ష్మారెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి ఛైర్మన్‌గా పలు కీలక పదవులను నిర్వహించారు.

Exit mobile version