Site icon NTV Telugu

Lakshmi Narayana: భారత్ అనే పేరు మార్చినంత ఈజీగా దేశంలో సమస్యలు పోవు..

Jd Laxmi Narayana

Jd Laxmi Narayana

రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అని ముందే ఉంది అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఇండియా అని బ్రిటీష్ వాళ్ళు ఇచ్చిన పేరు.. దేశం పేరు భారత్ గా మారుస్తున్నారని ప్రచారం జరుగుతుంది.. భారత్ గా మార్చటం తప్పేం కాదు.. ఇందుకు రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. అయితే, భారత్ గా మార్చినంత మాత్రాన దేశంలో సమస్యలు పోవు అని సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ తెలిపారు.

Read Also: Vijay Deverakonda: విజయ్ ఇచ్చే లక్ష కావాలంటే ఆ పని చేయాల్సిందే..

పేరు విషయం వల్ల అసలు విషయాలు పక్క దారి పట్టకుండా చూడాలి అని సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ చెప్పుకొచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎయిమ్స్ ఇలా అనేక వారి పేర్లను ఎలా మారుస్తరనేది చూడాలన్నారు. భారత్ గా పేరు మార్పుకు ప్రజాభిప్రాయం అవసరం లేదు.. ప్రజలతో ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఆమోదం తప్పనిసరిగా సవరణ సమయంలో ఉంటుంది.. ప్రతిపక్షాల కూటమి పేరు ఇండియా కాబట్టి భారత్ పేరు పెడుతున్నారని రాజకీయ విమర్శలు వస్తున్నాయ్ అని ఆయన తెలిపారు.

Read Also: Bihar: దేశానికి ప్రధాని ఎలా ఉండాలి, నితీష్ కుమార్లా ఉండాలి…! బీహార్లో విద్యార్థులు నినాదాలు

ఈ సందర్భంగా తెలుగు భాష గురించి సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. మా చిన్నతనంలో చదువు చెప్పిన గురువుగారిని కలిసి వచ్చాను.. 30 సంవత్సరాల తరువాత తెలుగు ఎవరైనా మాట్లాడతారా అనే భయం ఉంది.. ఆంగ్లభాష వల్ల మాత్రమే ఉద్యోగాలు రావడం లేదు.. ఆ ధోరణి మారాలి అని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాషను ఎలా రక్షించాలో అన్నదానిపై మాట్లాడాలి.. శ్వాసించినంత వరకే మనం, భాషించినంత వరకే మన భాష అని మాజీ జెడీ పేర్కొన్నారు.

Read Also: Kottu Satyanarayana: చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్..

మనకు వంద విశ్వనాథ సత్యనారాయణలు, వంద కందుకూరి వీరేశలింగంలు కావాలి అని లక్ష్మినారాయణ అన్నారు. చైనా వాళ్ళకి ఇంగ్లీషు రాదు… అయినా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు.. 90శాతం నోబుల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మాతృభాషలో మాట్లాడేవాళ్ళు.. వాడుకే మనం భాషకు చేసే వేడుక.. ఇంగ్లీషు భాషను కాటుక లాగా మాత్రమే వాడాలి.. విజ్ఞాన వేత్తల ఆలోచనలను పాలకులు తెలుసుకోవాలి అని సీబీఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ అన్నారు.

Exit mobile version