NTV Telugu Site icon

Mulugu Dist: ఏటూరునాగారంలో కారులో అటవీ జంతువు మాంసం లభ్యం.. నమోదు కానీ కేసు..!

Mulugu

Mulugu

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏటూరు గ్రామ సమీపంలో కారులో అటవీ జంతువు మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అటవీ జంతువు ఉన్న కారు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జంతువును వేటాడిన నిందితుల మీద అటవి శాఖ అధికారులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని వెల్లడి. నాలుగు రోజులు క్రితం జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ కారులో ఉన్న వాళ్ళ పైనా కేసు నమోదు చేయని అధికారులు.. మృతి చెందిన జంతువు నిర్ధారణ కోసం వేచి చూస్తున్నారు. ల్యాబ్ టెస్ట్ రిపోర్టు తర్వాత కేసు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Read Also: Hyderabad: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. గంజాయి సేవించిన డీజే సిద్ధూ..!

అయితే, అటవీ శాఖ అధికారుల తీరు పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో పాటు ఈ విషయాన్ని నాలుగు లోజుల పాటు బయటకు రాకుండా చేయడం పైనా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇక, ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం వల్లే అటవి జంతువులను వెటాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మరోసారి జరగొద్దు అంటే నిందితుల మీద కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.