Site icon NTV Telugu

Viral : ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం.. పోలీస్ జీప్‌పై డ్యాన్స్

Police Jeep

Police Jeep

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఇటీవల యువత రకరకాల స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే, తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంపై కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకున్నారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోను బట్టి చూస్తే.. ఇద్దరు యువకులు పోలీస్ జీప్ బానెట్‌పై కూర్చొని.. పోలీస్ జీప్ ముందు పోర్షన్ ఎక్కుతూ కాళ్లను అడ్డంగా పెట్టి కెమెరా లెన్స్‌లకు ఇద్దరు పోజులివ్వడం కనిపిస్తుంది.

Also Read : Music Director Raj: బిగ్ బ్రేకింగ్.. రాజ్- కోటి ద్వయంలో రాజ్ ఇకలేరు

అయితే ఈ ఘటన కాన్పూర్‌లోని బజారియా ప్రాంతంలో రికార్డ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. సదరు జీపు స్థానిక పోలీస్ స్టేషన్‌కి చెందినదిగా తెలుస్తోంది. కింగ్ అనే క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు. బానెట్‌పై కూర్చొన్న ఇద్దరు యువకుల్లో ఒకరు ఓ కేసులో నిందితుడి సోదరుడిగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ రెండో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

Also Read : 3 Houses just Rs.270: 270 రూపాయలకే మూడు ఇళ్లను కొన్న ఓ మహిళ

జీప్‌ను సర్వీసింగ్ కోసం దగ్గరలోని గ్యారేజ్‌కి పంపించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఈ యువకులు ఉద్దేశపూర్వకంగా వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీడియోలో కనిపిస్తున్న వాహనం నెంబర్ ప్లేట్ కాన్పూర్ దేహత్‌లోని అడిషనల్ డీజీ ఆఫ్ పోలీస్ పేరిట రిజిస్టర్ అయ్యిందని చెబుతున్నారు. ఇద్దరు యువకులు పోలీస్ జీపు బానెట్‌పై తీసిన వీడియోపై ఏసీపీ సిసామావు స్పందించారు. జీపు రిపేర్ కోసం వెళ్లిన సమయంలోనే ఈ యువకులు వీడియో తీశారని విచారణలో తేలిందన్నారు. వారిద్దరిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు అని తెలిపారు.

Exit mobile version