NTV Telugu Site icon

RBI: తమ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే రాజధాని ఏది అంటున్న ఆర్బిఐ..!

10

10

అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అమరావతిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతో ప్రధాని కార్యాలయం నుంచి ఆర్బీఐకి వివరాలు పంపమని లేఖను పంపడం జరిగింది. అందులో భాగంగా బుధవారం నాడు ఆర్బీఐ నుంచి రిజిస్టర్ పోస్టులో ఉత్తర్వులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమేట్ జావాడే నుంచి లేఖను అందుకున్నారు.

Also Read: Paarijatha Parvam Trialer : కిడ్నాపర్ గా మారిన సునీల్..పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటున్న ట్రైలర్..

ఇకపోతే భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా లిఖిత పూర్వకంగా జవాబులను ఇచ్చింది. కానీ భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తెలియకపోవటం విచారకరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అనేక అనైతిక చర్యల వలన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఎంతో బాధ్యత కలిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికే తెలియకపోవటం నిజంగా ఆలోచించే విషయమే. గత ప్రభుత్వ హాయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కొరకు 11 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ జీవోలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన కార్యకలాపాలు అన్ని బ్యాంకులలో జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బ్యాంకులు క్యాష్ అవసరాలను తీర్చుకుంటున్నాయి.
Also Read: EC Notices Pawan: పవన్ కళ్యాణ్కు ఈసీ నోటీసులు

ఇక ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబునాయుడు ఇతర వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన రాజధాని అమరావతిలో తక్షణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం పనులు ప్రారంభించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నట్లు తెలిపారు. గడచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్న రాష్ట్రాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.