NTV Telugu Site icon

T20 World Cup 2024: న్యూయార్క్‌లో ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా..

Teamindia

Teamindia

అమెరికా, వెస్టిండీస్‌లో జూన్ 2న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్‌లో శిక్షణను ప్రారంభించింది. ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య జరిగే గేమ్‌ తో ఈ మెగా ఈవెంట్ మొదలు కానుంది. భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఆపై సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు హార్దిక్ పాండ్య కూడా శిక్షణలో కనపడ్డాడు. ఈ టోర్నమెంట్ కోసం వారి సన్నాహాల్లో భాగంగా టీం కఠినమైన శిక్షణను తీసుకుంటుంది.

ఇకపోతే క్రికెటర్లు ట్రైనింగ్ సెషన్ నుండి కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని చిత్రాలను పంచుకున్నారు. అక్కడ ఆటగాళ్ళు జాగింగ్ చేస్తూ, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జట్టు ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడుతుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా న్యూయార్క్‌ లోనీ మొదటి శిక్షణా సెషన్ నుండి కొన్ని చిత్రాలను పోస్ట్ చేసారు.

రోహిత్ అండ్ టీం.. ఐర్లాండ్, కెనడా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, ఆతిథ్య సహ -హోస్ట్ అమెరికాతో పాటు గ్రూప్ A లో ఉన్నారు. జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌ తో టీమిండియా టోర్నమెంట్ ను ప్రారంభించనుంది. దానికి ముందు జూన్ 1న వార్మప్ గేమ్‌ లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. 2021 సెమీఫైనల్‌ లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2007 లో భారతదేశం T20 ప్రపంచ కప్ విజయం ఐసీసీ ఈవెంట్‌ టీ20 ఫార్మాట్‌లో సాధించిన ఏకైక ట్రోఫీ. ఆ తర్వాత ఐసీసీ నుండి 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చాయి.