Australia’s 1st Female Army Chief: మహిళా శక్తి.. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ గా మహిళా..
- ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం చారిత్రక నిర్ణయం
- ఆస్ట్రేలియా సైన్యం కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీగా లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్
- 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా సైన్యం కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీగా లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయల్ ను నియమించింది. ఇది ఆస్ట్రేలియా సైన్యం 125 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి మహిళా సైన్యాధికారి నియామకం. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఒక ప్రకటనలో తెలిపారు.. “జూలై నుంచి ఆస్ట్రేలియా సైన్యం 125 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా మహిళా చీఫ్ ఆఫ్ ఆర్మీని కలిగి ఉంటుంది. ”లెఫ్టినెంట్ జనరల్ సూజన్ కాయిల్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్ జాయింట్ కెపాబిలిటీస్ గా పని చేస్తున్నారు. జూలై నుంచి ఆమె లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టూవర్ట్ స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read:Bihar: రేపే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక.. ఎల్లుండి ప్రమాణస్వీకారం
Also Read
సూసన్ కోయల్ గురించి
1987లో ఆర్మీ రిజర్వ్స్‌లో సైనికురాలిగా చేరారు. దాదాపు 40 సంవత్సరాల సైనిక సేవలో సోలమన్ దీవులు, ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో సేవ చేశారు.
ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, ఫోర్సెస్ కమాండ్, జాయింట్ టాస్క్ ఫోర్స్ వంటి ఉన్నత పదవులు నిర్వహించారు.
ఆస్ట్రేలియా రక్షణ దళాల్లో (ఆర్మీ, నేవీ లేదా ఎయిర్‌ఫోర్స్) మొదటిసారి మహిళా చీఫ్‌గా ఆమె నియమితులవుతున్నారు.
Also Read:Mangli: పంజాగుట్ట పీఎస్‌కు తాగి వచ్చి.. మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది
రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ నియామకాన్ని “లోతైన చారిత్రక క్షణం” (deeply historic moment) అని అభివర్ణించారు. “ఆమె సాధించిన ఈ విజయం ఆస్ట్రేలియా చరిత్రలో ప్రతి సేవా విభాగాన్ని నడిపే మొదటి మహిళగా ఆమెను చేస్తుంది” అని చెప్పారు. ఈ నియామకం ఆస్ట్రేలియా రక్షణ దళాల్లో మహిళల సంఖ్యను పెంచడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఈ చర్య కీలకంగా మారింది. ప్రస్తుతం ADFలో మహిళలు సుమారు 21% ఉన్నారు, సీనియర్ లీడర్‌షిప్‌లో 18.5% మాత్రమే ఉన్నారు. ఈ నియామకం సమయంలో ADF లీడర్‌షిప్‌లో మరికొన్ని మార్పులు కూడా జరిగాయి. వైస్ అడ్మిరల్ మార్క్ హామండ్, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్‌గా నియమితులయ్యారు. రియర్ అడ్మిరల్ మాథ్యూ బక్లీ కొత్త చీఫ్ ఆఫ్ నేవీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ చారిత్రక నిర్ణయం ఆస్ట్రేలియా సైన్యంలో మహిళలకు కొత్త ఆశలు కలిగిస్తుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!