NTV Telugu Site icon

Madhya Pradesh: ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు..

Gun Fire

Gun Fire

ఉద్యోగం నుండి తొలగించారని సీఎంఓపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా హర్సూద్ మున్సిపల్ కౌన్సిల్ సీఎంఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం కాల్పుల ఘటన కలకలం రేపింది. పిస్టల్‌తో వచ్చిన రోజువారీ వేతనంపై పనిచేస్తున్న డ్రైవర్, మహిళా సీఎంఓ (ముఖ్య మున్సిపల్ అధికారి)పై వరుసగా 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. కంట్రీ మేడ్ పిస్టల్‌తో నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. కాల్పుల నుంచి సీఎంఓ తృటిలో తప్పించుకోగా.. ఆమెను రక్షించేందుకు వచ్చిన ఓ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. అతన్ని ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు.

AP and Telangana Rains LIVE UPDATES: వరుణుడి ప్రతాపం.. రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

వివరాల్లోకి వెళ్తే.. హర్సూద్ సీఎంఓ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. సమాచారం ప్రకారం.. సీఎంఓ మోనికా పార్ది కార్యాలయంలోని తన క్యాబిన్‌లో పనిచేస్తున్నారు. ఇంతలో సీఎంఓ డ్రైవర్ విశాల్ నామ్‌దేవ్ హఠాత్తుగా క్యాబిన్‌లోకి ప్రవేశించాడు. వెంటనే.. అతను తన కంట్రీ మేడ్ పిస్టల్ తో సీఎంఓ పార్దిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దంతో క్యాంపస్‌లో భయాందోళన నెలకొంది. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Donald Trump: ట్రంప్ గెలవద్దని భార్య మెలానియా కోరుకుంటోందా..? వైట్‌హౌజ్ మాజీ అధికారి సంచలనం..

ఈ క్రమంలో.. నిందితుడిపై కేసు నమోదు చేశారు. అయితే.. డీజిల్ చోరీ, తదితర ఆరోపణలపై నిందితుడికి సీఎంఓ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో సీఎంవో ఆయనను విధుల నుంచి తప్పించింది. ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. తాజాగా డీజిల్ చోరీకి పాల్పడ్డాడన్న అనుమానంతో మళ్లీ ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే.. ఆగ్రహించిన నిందితుడు విశాల్ నామ్‌దేవ్ కాల్పులు జరిపాడు. ప్రస్తుతం.. నిందితుడు విశాల్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Show comments