NTV Telugu Site icon

Heart Attack : కాలేజి బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు.. చివరకు..

Heart Attack

Heart Attack

Heart Attack while Driving College Bus in Hyderabad: తాజాగా హైదరాబాద్ మహానగరంలో కాలేజ్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడం సంచల విషయంగా మారింది. ఈ సంఘటనలో తనకు గుండెపోటు వస్తుందని గ్రహించిన బస్సు డ్రైవర్ తాను డ్రైవ్ చేస్తున్న కాలేజీ బస్సులో విద్యార్థులు ఉన్నారన్న ఆలోచనతో వారిని ప్రాణాలని కాపాడాలని ఆలోచించి నడుపుతున్న వాహనాన్ని పక్కకు ఆపి ప్రాణాలు వదిలిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Mallu Bhatti Vikramarka: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విందు..

హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ మండలం కాచారం గ్రామానికి చెందిన 30 ఏళ్ల మైలారం రాజు అనే వ్యక్తి వర్ధమాన్ కళాశాల బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు లాగే ఉదయం పూట కళాశాల విద్యార్థులను బస్సు ఎక్కించుకొని కాలేజీకి తీసుకు వెళ్తుంటాడు. అలాగే శనివారం నాడు కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కాలేజీ విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని అరంగర్ నుంచి మెహిదీపట్నం వైపుగా ప్రయాణం చేస్తున్నారు.

Daggubati Rana: ఉత్తమ నటుడిగా రానా.. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ కు గాను..

అయితే, ఈ సమయంలో ఒక్కసారిగా రాజుకు గుండెపోటు వచ్చింది. ఇక ఆ విషయాన్ని తన పడుతున్న బాధను బస్సులోని విద్యార్థులకు చెబుతూనే బస్సును ఒక పక్కకు ఆపి అక్కడ స్టీరింగ్ పైనే రాజు పడిపోయాడు. దీంతో వెంటనే బస్సులోని విద్యార్థులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రాజును తరలించగా అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందాడని తెలిపారు. ఇకపోతే మృతుడు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి అత్తపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments