NTV Telugu Site icon

Ugadi Rush: ఉగాది ఎఫెక్ట్‌.. పువ్వులకు ఫుల్‌ డిమాండ్‌.. ధర ఎంతంటే..?

Flowers

Flowers

Ugadi Rush: తెలుగు రాష్ట్రాలు తెలుగు సంవత్సరాది ఉదగాది వేడుకలకు సిద్ధం అవుతున్నాయి.. అయితే.. ఓ వైపు ఎండలు మండిపోతుండడంతో.. పువ్వుల దిగుమతి తగ్గిపోయింది.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు ఉగాది సందడి నెలకొంది. మంగళవారం జరిగే ఉగాది వేడుకలకు ఈ రోజు నుంచి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నడంతో పూల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అందుకనే వీటి ధరలు మరింతగా పెరిగాయి. తెల్ల చామంతి కేజీ రూ. 450 దాటి పలకగా మిగిలిన చామంతులు రూ.350 నుంచి 400 పలికాయి.

Read Also: Mumbai Indians: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్!

అలాగే బంతి పువ్వులు కిలో రూ.80, లిల్లీ రూ.60, మల్లి రూ.700 నుంచి రూ.800, గులాబీ రూ.250 నుంచి 300, కనకాంబరాలు బారు రూ.100 నుంచి రూ.150 కు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన పువ్వులు ఇతర జిల్లాలకు ఎగుమతులు జరిగాయి. ఇక, ఈ రోజు, రేపు ఉభయ గోదావరి జిల్లాలకు ఎగుమతులు ఉండటం వల్ల ఈ పూల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. చామంతిలో కొత్త రకాలు రావడం వల్ల అవి మండే ఎండలను కూడా ఎదురొడ్డి దిగుబడులు ఇస్తున్నాయి. ఇది పూల రైతులకు మంచి పరిణామం. ఈ రకం చామంతిని ఈ ఏడాది కొంతమంది రైతులు సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక, పువ్వులు హోల్‌సెల్‌ మార్కెట్‌లో ధరలు పోల్చుకుంటే.. బహిరంగ మార్కెట్‌లో మరింత అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.. రైతుల నుంచి వినియోగదారునికి పువ్వులు చేరే సరికి వాటి ధరలు భారీ మార్పులు కనిపిస్తున్నాయి.