NTV Telugu Site icon

Florida Woman: ప్లీస్‌ హెల్ప్‌ అంటూ పిజ్జా ఆర్డర్‌.. రంగంలోకి పోలీసులు.. కథ అంతా బాయ్‌ ఫ్రెండ్‌ చుట్టూ.

Pizza

Pizza

Florida Woman: ఆపదలో ఉన్నప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరు ఆలోచించని విధంగా వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక ఫ్లోరిడాలో ఆపదలో ఉన్న ఓ మహిళ కూడా డిఫరెంట్ గా ఆలోచించి తనతో పాటు తన ఇద్దరి పిల్లలను కూడా రక్షించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన చెరిల్ ట్రెడ్‌వే అనే మహిళను తన ఇద్దరి పిల్లలతో సహా ఆమె బాయ్ ఫ్రెండ్ ఈతాన్ ఎర్ల్ నికెర్సన్‌ బంధించాడు. వారిని అనేక చిత్రహింసలకు గురిచేశాడు. అయితే అతని బారి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలుకాకపోవడతో చెరిల్ కు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. వెంటనే తాను పిజ్జా ఆర్డర్ చేసుకుంటానని ప్రియుడిని కత్తితో బెదిరించి ఫోన్ లాక్కోని పిజ్జా హట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంది.

Also Read: Uttarpradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన టీచర్

అయితే ఇక్కడే ఆ మహిళ తన తెలివితేటలను ఉపయోగించింది. ఎవరికి రాని ఐడియాతో పోలీసులకు తాము బంధిగా ఉన్నామన్న  విషయాన్ని తెలియజేసింది. పెప్పరోనితో పాటు స్మాల్‌ క్లాసిక్ పిజ్జాను ఆర్డర్‌ చేసిన ఆమె పిజ్జా హట్‌ సిబ్బందికి.. పోలీసు అధికారుల సహాయం కావాలని మెసేజ్‌ చేసింది. ‘ప్లీజ్ హెల్ప్, గెట్ 911 టు మీ’ అని ఆ మహిళ నోట్ లో పేర్కొంది. దీంతో పిజ్జా యాప్ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా వారు చెరిల్ తో పాటు ఆమె ఇద్దరు పిల్లలను కూడా రక్షించారు. అంతేకాకుండా పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.  ఇక విషయం పై స్పందిస్తూ  తాను 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానని ఇంతవరకు ఇలాంటి ఉదంతం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు రెస్టారెంట్ మేనేజర్. ఏదేమైనా వారు సురక్షితంగా తప్పించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.  ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిజ్జా యాప్ తో ఇలా చేయొచ్చని ఇంత వరకు తెలియదు అంటూ ఒకరు కామెంట్ చేయగా, పిజ్జా డెలివరీ బాయ్ కు బదులు పోలీసులు డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యింటే బాగుండేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆమె తెలివికి మాత్రం అందరూ వావ్ అంటున్నారు.