NTV Telugu Site icon

Srisailam Project: కృష్ణమ్మ హోరు.. శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తివేత

Srisailam

Srisailam

Srisailam Project: కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తు్న్నారు. .. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులు ఉండగా.. 10 గేట్లు ఎత్తడంతో ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది. ఇక, శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 214.3637 టీఎంసీల నీటినిల్వ ఉంది. కుడి గట్టు జలవిద్యుత్‌ కేంద్రంతో పాటు.. ఎడమ గట్టు జల విద్యుత్ కేందంలోనూ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

Read Also: CM Chandrababu: ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగుజాతి తయారవ్వాలి..

శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న నాగార్జునసాగర్ కూడా కూడా నిండు కుండలా మారింది. పై నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు 20 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుకు 2లక్షల 10వేల 408 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తుండగా.. 2 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా.. ప్రస్తుత నీటిమట్టం గరిష్ఠస్థాయిలోనే ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు తీయడంతో చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తున్నారు.