జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగడంతో ఆ ఊరు మొత్తం వరదలో మునిగిపోయింది. వరద గుప్పిట్లో భయంతో బతికిన మోరంచ పల్లి గ్రామం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. బురదమయమైనటువంటి ఇళ్లలో శుభ్రం చేసుకుంటున్నారు. వండుకునే స్థితి లేకపోవడంతో బంధువులు తీసుకొచ్చిన భోజనం తినడము లేక అధికారులు ఏర్పాటు చేసిన భోజనం తినే స్థితిలోనే ఇంకా మొరంచపల్లి ఉంది. నలుగురు గల్లంతయితే ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read : Bhola shankar : మెగాస్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా భారీ కటౌట్ ఏర్పాటు..
మూరంచవాగు పొంగి పొరడం వల్ల మోరంచవాగు అనుకొని ఉన్న మోరంచ పల్లి గ్రామం మొత్తం అతలాకుతలమైంది. మొత్తం 285 ఇళ్లు ఉన్న గ్రామంలో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మొరంచపల్లి గ్రామం బోరుమంటోంది.
మోరంచ వాగు పొంగి వరద గుప్పిట్లో ఉన్న మొరంచపల్లి గ్రామం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతితో భయం గుప్పిట బతికిన మొరంచపల్లివాసులు ఆ విషాద ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నారు.. వరద బీభత్సం జరిగి 48 గంటలైనా ఇంకా ఆ షాక్ నుంచి కొందరు కోలుకోలేదు మరికొందరు మాత్రం ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నారు .. బరుదమయం అయిన ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు సర్వం కోల్పోయిన గ్రామస్తులందరూ సాధారణ జీవన సాగించేందుకు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు
మరోవైపు గల్లంతైన నలుగురిలో ఇద్దరు మృతదేహాలు దొరికాయి.. మొరంచ వాగు వరదలో మొన్న కొట్టుకపోయిన వారిలో గొర్రె ఓదిరెడ్డి,గొంగిడి సరోజనమ్మ మృతదేహలు లభ్యమయ్యాయి. చిట్యాల మండలంలోని పాచిగడ్డ తండా శివారు పొలాలలో ఓదిరెడ్డి మృతదేహం,సోలిపేట తాళ్ల వద్ద పంట పొలాలలో సరోజనమ్మ మృదేహలను స్థానికుల సమాచారంతో గుర్తించారు. మరోవైపు పోలీసులు వరదలో గల్లంతైన వారికోసం గాలింపు ముమ్మరం చేశారు.బృందాలుగా విడిపోయి వాగు పరిసర ప్రాంతాలలో వెతుకుతున్నారు.
మోరంచవాగు దిగువ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల సహాయంతో జల్లెడ పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు,రైతులు, యువకులు,మత్స్యకారులు తమ తమ ప్రాంతాలలో పరిశీలించి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మోరంచ పల్లి గ్రామం వద్ద ఎన్జీవోల తాకిడి వివిధ సంస్థలకు చెందిన వారు చీరలు తినేందుకు అన్నం ప్యాకెట్లు మంచినీళ్ల క్యాన్లు ఇస్తారా సరుకులు పంపిణీ చేసారు.
సిరికొండ ప్రశాంత్ నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీన్మార్ మల్లన్న టీం బీజేపీ చందుపట్ల కీర్తి రెడ్డి తదితరులు గ్రామాన్ని సందర్శించారు.. ఆహారప్రదార్థాలు అందిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. వరద ప్రభావంతో ఊర్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తో పాటు బురదను తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,కలెక్టర్ భవేశ్ మిశ్రా లు పరిశీలించారు. దగ్గరుండి సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.