Flipkart Zero Commission: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన అమ్మకపుదారుల కోసం భారీ సదుపాయాన్ని ప్రకటించింది. రూ.1,000 కన్నా తక్కువ ధర కలిగిన ఉత్పత్తులపై జీరో కమిషన్ మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది ఎంఎస్ఎంఈ (SSME)లు, చిన్న వ్యాపారాలు తక్కువ ఖర్చుతో వ్యాపారం చేసే అవకాశం పొందనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. రూ.1,000 కన్నా తక్కువ ధరలో ఉండే ఉత్పత్తులను లిస్టింగ్ చేసే అర్హత ఉన్న విక్రేతలకు కమిషన్ పూర్తిగా మాఫీ చేయబడుతుంది. దీని వల్ల విక్రేతల వ్యాపార నిర్వహణ వ్యయం 30% వరకూ తగ్గే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. ఇది వినియోగదారులకు కూడా మరింత చవక ధరలకు ఉత్పత్తులు అందుబాటులోకి రావడంలో సహాయపడనుంది.
Minister Vakiti Srihari : మా పాలనపై నమ్మకంతోనే ప్రజలు ఓటు వేశారు !
ఫ్లిప్‌కార్ట్ హైపర్ వ్యాల్యూ ప్లాట్‌ఫామ్ షాప్సీపై జీరో కమిషన్ మోడల్‌ను ఉత్పత్తి ధరతో సంబంధం లేకుండా అన్ని కేటగిరీలకు విస్తరించింది. దీంతో హైపర్ వ్యాల్యూ సెగ్మెంట్‌లో అమ్మకాలు చేసే విక్రేతలకు పెద్ద స్థాయిలో లాభాలు కలిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఏ విషయమై ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ ప్లేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సకైత్ చౌధరి మాట్లాడుతూ.. “భారత జీడీపీకి సుమారు 30% వాటా ఇచ్చే ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు మేము అడ్డంకులను తొలగించే చర్యలను తీసుకుంటున్నామన్నారు. కొత్త, ప్రాంతీయ బ్రాండ్‌లు ధైర్యంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి రావడానికి ఈ జీరో కమిషన్ మోడల్ కీలకంగా మారుతుందని ఆయన తెలిపారు. అలాగే వినియోగదారుల కోసం కూడా ఈ మోడల్ ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ముఖ్యంగా రూ.1,000 లోపు ధరల్లో డిమాండ్ ఎక్కువగా ఉండే విలువ ఆధారిత కేటగిరీల్లో మరింత చవక ధరలు లభిస్తాయని అన్నారు.
ఇండియా తొలి ‘గియర్డ్ ఎలక్ట్రిక్ బైక్’ MATTER AERA 5000+ లాంచ్.. ధర ఎంతంటే..?