పండుగ సీజన్ ప్రారంభమైంది. దసరా, దీపావళి నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్, అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి రెండు ప్లాట్‌ఫామ్‌లలో సేల్స్ మొదలయ్యాయి. రెండింటిలో కూడా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మాత్రం ఐఫోన్‌లపై ఉన్నాయి. సేల్ సందర్భంగా ఐఫోన్‌లను కొనడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్.. ఎందులో భారీ తగ్గింపులు ఉన్నాయో ఓసారి చూద్దాం.
ఐఫోన్ 16 ఫోన్ 128 జీబీ వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ.79,900గా ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో రూ.54,999కి అందుబాటులో ఉంది. 10 శాతం సూపర్ మనీ లేదా 4 వేల క్యాష్ బ్యాక్ కూడా మీకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ అనంతరం రూ.51,999కి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. అదే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.69,499గా ఉంది. బ్యాంకు ఆఫర్ 3 వేలు పోయినా 66 వేలు కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 కొనడం చాలా చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
Also Read: Virat Kohli Fan: విరాట్ కోహ్లీపై పిచ్చి.. మొబైల్ కవర్‌పై బంగారంతో కింగ్ ఫోటో, పేరు!
ఐఫోన్ 15 ఫోన్ 128 జీబీ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.79,900 ధరకు లిస్ట్ అయింది. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.43,799 ధరకు అందుబాటులో ఉంది. అందులోనే బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అదే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే రూ.59,999గా ఉంది. ఐఫోన్ 15 అమెజాన్‌లో కొనడం బెటర్. ఇక ఐఫోన్ 14 ఫోన్ 128 జీబీ వేరియంట్ ధర లాంచ్ సమయంలో రూ.79,900 కాగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సమయంలో రూ.39,999కి అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 128 జీబీ వేరియంట్ అమ్మకానికి అందుబాటులో లేదు. మీరు ఓ మైబైల్ కొనాలని ఫిక్స్ అయ్యాక.. అన్నింట్లో ప్రైస్ చెక్ చేసి తక్కువ దాంట్లో కొనేసుకుంటే బెటర్.
