Site icon NTV Telugu

Valentines Day Sale 2025: నథింగ్ ఫోన్స్ పై వాలెంటైన్స్ డే సందర్భంగా భారీగా డిస్కౌంట్

Nothing 2a

Nothing 2a

Flipkart Valentines Day Sale 2025: భారత మార్కెట్‌లో ప్రముఖ టెక్ సంస్థ నథింగ్ (Nothing) తన 2025 ఏడాది తొలి ఈవెంట్‌ను మార్చి 4న నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌లో నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) లాంచ్ అవుతుందని ఉహించినా, చివరికి నథింగ్ ఫోన్ 3A (Nothing Phone 3a) సిరీస్ విడుదల కానుందని సంస్థ ధృవీకరించింది. దింతో నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a), నథింగ్ ఫోన్ 3ఏ ప్రో (Nothing Phone 3a Pro) రెండు మోడళ్లు విడుదల కానున్నాయి. ఈ కొత్త సిరీస్ లాంచ్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్ తమ నథింగ్ ఫోన్ 2ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు భారీ తగ్గింపును ప్రకటించింది.

Also Read: Kareena Kapoor: ఏదైనా మనదాకా వస్తే కానీ అర్థం కాదు: కరీనా కపూర్

ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్ సందర్బంగా ఈ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక ఈ డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2a Plus ఫోన్ లో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 29,999. అయితే సేల్ లో భాగంగా ఏకంగా రూ. 4500 (15% తగ్గింపు)తో రూ. 25,499లకు అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఒకసారి చూస్తే.. 6.7-ఇంచ్ Full HD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, మీడియాటెక్ Dimensity 7350 ప్రో 5G చిప్‌సెట్ ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా (Samsung GN9 సెన్సార్, OIS, 10x డిజిటల్ జూమ్), 50MP సెకండరీ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ ఉండనున్నాయి.

Also Read: Mahakumbh 2025 : కుంభమేళాలో ట్రాఫిక్ ఇబ్బందులు.. వందలాది వాహనాలపై చలాన్లు… ఇప్పటి వరకు ఎంత వసూలయ్యాయంటే ?

ఇక నథింగ్ ఫోన్ 2a విషయానికి వస్తే.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 25,999. సేల్ లో భాగంగా ఏకంగా రూ. 4000 (15% తగ్గింపు)తో రూ. 21,999లకు అందిస్తున్నారు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్‌లో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుంది. ఇక నథింగ్ ఫోన్ 2a స్పెసిఫికేషన్లు 6.7-ఇంచ్ ఫ్లాట్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ Dimensity 7200 ప్రో సెటప్ ప్రాసెసర్, 50MP ప్రైమరీ + 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.

Exit mobile version