Site icon NTV Telugu

Flipkart Minutes: పాత స్మార్ట్‌ఫోన్‌లను పడేస్తున్నారా?.. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సర్వీస్ ద్వారా నిమిషాల్లోనే మార్చుకోవచ్చు!

Flipkart

Flipkart

స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరకే లభిస్తుండడంతో ఒకరి వద్ద ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. అయితే మొబైల్స్ పాతబడినపుడు.. ఫోన్ పనిచేస్తుంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లేదా పాడైపోయినప్పుడు పడేయడం లేదా ఇంట్లోనే ఉంచుకుంటారు. ఇలాంటి ఫోన్లు కలిగి ఉన్నవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మినిట్స్ అనే కొత్త సర్వీస్ ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ద్వారా నిమిషాల్లోనే పాత ఫోన్లను మార్చుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ ఇప్పటికే యాప్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో కూడా ప్రయోజనాన్ని పొందుతారు. అంటే మీరు మీ పాత లేదా దెబ్బతిన్న ఫోన్‌లను కొన్ని నిమిషాల్లోనే మార్పిడి చేసుకోవచ్చు.

Also Read:Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ గురించి, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ వైస్ ప్రెసిడెంట్, కాంచన్ మిశ్రా, సీనియర్ డైరెక్టర్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ పాత లేదా దెబ్బతిన్న ఫోన్‌లను కేవలం 40 నిమిషాల్లో మార్పిడి చేసుకోవచ్చని చెప్పారు. PREXO (ప్రొడక్ట్ ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్) అనేది ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్. ఇది రియల్ టైమ్‌లో ఫోన్ ఎక్స్ఛేంజ్ సౌకర్యాన్ని అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ను ఉపయోగిస్తోంది.

Also Read:Chhangur Baba: హిందూ, సిక్కు మహిళల్ని ఇస్లాంలోకి మారిస్తే ఒక్కో రేటు.. ఛంగూర్ బాబా ‘‘లవ్ జిహాద్’’ అరాచకాలు..

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరగా పొందగలుగుతారని, మీ పాత ఫోన్‌ను తక్షణమే మార్పిడి చేసుకోగలరని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఫోన్ ఎలాంటి కండీషన్ లో ఉన్నా మార్పిడికి అనుమతిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం PREXO ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని ఎంపిక చేసిన పిన్ కోడ్‌లలో ప్రారంభించారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఇతర మెట్రోలు, టైర్-2 నగరాలకు PREXO సేవను విస్తరించడమే కంపెనీ లక్ష్యం అని కార్యనిర్వాహకులు చెబుతున్నారు.

Also Read:Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.

ఇది ఎలా పని చేస్తుంది?

ఈ సేవను ఉపయోగించడానికి, మీరు మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ప్రొడక్ట్ పేజీకి వెళ్లాలి. ఇక్కడ, క్రిందికి స్క్రోల్ చేసి, ఎక్స్ఛేంజ్ ఎంపికకు వెళ్లి, చెక్ ధరపై క్లిక్ చేయండి. ఆపై మీరు మీ పాత ఫోన్ వివరాలను నమోదు చేయాలి – బ్రాండ్, మోడల్ నంబర్ వంటివి. దీని తర్వాత హ్యాండ్ సెట్ స్థితిని ఎంచుకోవాలి. దాని ఆధారంగా మీకు ధర చూపిస్తుంది. ఎక్స్చేంజ్ ను కన్ఫామ్ చేసి ఆర్డర్ తీసుకోవాలి. దీని తరువాత, కంపెనీ నుంచి ‘విష్ మాస్టర్’ మీ ఇంటికి వచ్చి పాత ఫోన్ ఆన్-ది-స్పాట్ డయాగ్నస్టిక్ పరీక్షను నిర్వహిస్తారు. స్మార్ట్‌ఫోన్ పనితీరు ఆధారంగా తుది ధర నిర్ణయిస్తారు. ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంక్ ఆఫర్‌లు, ఇతర డిస్కౌంట్ ఆఫర్‌లను పొందినట్లే, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌లో కూడా మీకు ఇలాంటి ఆఫర్‌లు లభిస్తాయని కాంచన్ మిశ్రా చెప్పారు. దీనితో పాటు, మీరు PREXO కింద ఎక్స్ఛేంజ్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

Also Read:Trump: రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్‌కు 500 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ హెచ్చరికలు

ఫోన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు బిల్లు లేదా బాక్స్ లేకపోయినా పర్లేదని కంపెనీ చెబుతోంది. ఇది కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండవచ్చు. కానీ దొంగిలించబడిన ఫోన్‌లకు సంబంధించి ఓ ప్రశ్న తలెత్తుతుంది. అయితే, దీని కోసం IMEI ధృవీకరణపై పనిచేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ అధికారులు చెబుతున్నారు. ఏదైనా ఫోన్ దొంగిలించబడినట్లు తేలితే, అది వెంటనే సిస్టమ్ నుంచి తీసివేయబడుతుందన్నారు.

Exit mobile version