Flipkart: గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. 30 సెకన్లలోనే పర్సనల్ లోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ రిటైలర్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. తన ప్లాట్‌ఫారమ్‌లో యాక్సిస్ బ్యాంక్ సౌజన్యంతో వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లోని కస్టమర్లు మూడేళ్ల వరకు యాక్సిస్ బ్యాంక్ నుండి రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను పొందగలరని ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు 45 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. స్టేట్‌మెంట్ ప్రకారం, ఈ భాగస్వామ్యం కింద కస్టమర్‌లు 30 సెకన్లలోపు రుణ ఆమోదం పొందుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వ్యక్తిగత రుణాలు మరియు క్రెడిట్ కార్డ్‌ల వంటి అధిక-రిస్క్ రుణాలలో అధిక వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికల మధ్య ఈ ప్రకటన వచ్చింది.
Read Also: Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
మా ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఇప్పటికే బై నౌ పే లేటర్ (BNPL), ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (EMIలు) మరియు క్రెడిట్ కార్డ్‌ల వంటి ఆర్థిక సేవలను అందిస్తోంది అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా అన్నారు. యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ సమీర్ శెట్టి మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ద్వారా, బ్యాంక్ విస్తృత సెగ్మెంట్ కస్టమర్లకు క్రెడిట్ సౌకర్యాలను అందించనుందని తెలిపారు. ఇక, రూ. 5 లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉండగా.. ఆ మొత్తాన్ని 6 నుండి 36 నెలల వరకు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ చేసుకోవచ్చు.. మరోవైపు పర్సనల్ లోన్ అంటే బ్యాంకులు ఎన్నో రకాల షరతులు పెడుతున్నాయి.. అడిగినన్ని వివరాలు సమర్పించాల్సిందే కానీ, కస్టమర్లు తమ లోన్‌ల ఆమోద ప్రక్రియ కేవలం 30 సెకన్లలో పూర్తవుతుందని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది.. లోన్ దరఖాస్తును ప్రారంభించడానికి, కస్టమర్లు.. వారి పాన్, పుట్టిన తేదీ మరియు చేస్తున్న జాబ్ వంటి వివరాలను అందించాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!