Site icon NTV Telugu

Flipkart Big Saving Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. 80 శాతం డిస్కౌంట్స్! క్రేజీ డీల్స్‌ ఎప్పుడంటే

Flipkart Big Saving Days 2023

Flipkart Big Saving Days 2023

Flipkart Big Saving Days Sale 2023 Dates Out: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌ను నిర్వహించనుంది. అమెజాన్ ఇండియా ఈ సేల్‌ను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు నిర్వహిస్తోంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో అన్ని వస్తువులపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తోంది. మరోవైపు మరో ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2023ని ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2023 ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 9 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ టాప్‌లు, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌ అందుబాటులోకి వస్తుంది.

Also Read: Upcoming Smartphones in India: అద్భుత ఫీచర్లతో.. ఆగస్టులో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2023లో క్రేజీ డీల్స్‌ పేరున అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కొత్త ఆఫర్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. ‘ఫోర్‌ అవర్‌ డీల్స్‌’ సేల్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకమైన ఆఫర్లు ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఇక ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా క్రెడిట్‌/డెబిట్‌ కార్డు.. ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ సూపర్‌ ఎలైట్‌ కార్డ్‌పై సూపర్‌ కాయిన్స్‌ లభించనున్నాయి.

ఈ సేల్‌లో కొన్ని వస్తువులపై ఏకంగా 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ టాప్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, దుస్తులు, ఫర్నిచర్‌లపై 80శాతం డిస్కౌంట్‌ ఉండనుంది. టీవీ, ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 75 శాతం.. బ్యూటీ, ఫుడ్‌, టాయ్స్‌పై 85 శాతం వరకు డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. వీటిపై ఎంత డిస్కౌంట్‌ ఉంటుందనే వివరాలు సేల్ ఆరంభం అయ్యాక తెలుస్తుంది.

Also Read: Moeen Ali Retirement: రెండోసారి రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌.. ఈసారి మెసేజ్ డిలీటే!

Exit mobile version