NTV Telugu Site icon

Big Billion Days Sale 2024 Date: ‘ఫ్లిప్‌కార్ట్’ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! పండగే ఇగ

Big Billion Days Sale 2024

Big Billion Days Sale 2024

Flipkart Big Billion Days Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ప్రతి ఏడాది ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. దసరా మరియు దీపావళి పండగ సీజన్‌ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి సేల్‌ మొదలు కానుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్లస్‌ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్‌ 29) సేల్‌ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్‌ 25 నుంచి 28 మధ్య డీల్స్ వివరాలు వెల్లడి కానున్నాయి.

వారం పాటు కొనసాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో హోమ్ నీడ్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అతి తక్కువ ధరలతో అందుబాటులో ఉండనున్నాయి. ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉండవచ్చు. స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్స్.. గృహోపకరణాలపై 75-80 శాతం వరకు ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుదారులపై డిస్కౌంట్‌ అందిచనున్నారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపైనా డిస్కౌంట్‌ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ చెల్లింపులతో రూ.50 తగ్గింపు, నో-కాస్ట్‌ ఈఎంఐ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

Also Read: Muttiah Muralitharan: నా వరల్డ్ రికార్డును బ్రేక్‌ చేసే మొనగాడే లేడు: మురళీధరన్

సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. యాపిల్‌, శాంసంగ్‌, మోటో, వన్‌ప్లస్‌, షావోమీ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభించేదీ త్వరలోనే వెల్లడించనున్నారు. యాపిల్‌ 16 సిరీస్‌ లాంచ్‌ అయిన నేపథ్యంలో పాత మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ లభించే అవకాశం ఉంది. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కూడా ‘గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్’ సేల్‌ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Show comments