NTV Telugu Site icon

Suicide Attempt in Flight: విమానంలో ప్రయాణికుడి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

Eva Air Flight

Eva Air Flight

Passenger Suicide Attempt in Flight: తైవాన్‌కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్‌’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గత శుక్రవారం (మార్చి 15) జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుడి వివరాలు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఇవా ఎయిర్‌లైన్స్‌ వెల్లడించలేదు.

ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీఆర్‌ 67 ఫ్లైట్‌ మార్చి 15న బ్యాంకాక్‌ నుంచి లండన్‌ బయల్దేరింది. విమానంలోని ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లోకి వెళ్లి.. ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. వాష్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా అతడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు. సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం లండన్‌ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించి.. హిత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

Also Read: Hyundai Creta EV: రోడ్లపై చక్కర్లు కొడుతున్న హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు.. 2025లో లాంచ్!

స్థానిక లండన్ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయింది. ఫ్లైట్‌ ల్యాండింగ్‌ కంటే ముందే వైద్య సిబ్బంది అతడికి ప్రధమ చికిత్స అందించారు. విమానం ల్యాండ్ అవ్వగానే ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను ఇవా ఎయిర్‌లైన్స్‌ ధృవీకరించింది. అయితే ప్రయాణికుడి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచింది.

 

 

Show comments