Flexi War: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పొలిటికల్ హైడ్రామాకు తెరలేచింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఇరగవరం నుంచి తణుకు వరకు రేపు చంద్రబాబు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా మంత్రి కారుమూరి వర్గం ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీకి పోటీగా టీడీప రైతు పోరుబాట పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Read Also: CM Jagan Tour: నేడు సీఎం జగన్ విశాఖ పర్యటన
ఇరు పార్టీలు పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో తణుకులో రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు పాదయాత్ర చేయనున్న ఇరగవరం నుంచి తణుకు వరకు 12కిలోమీటర్ల మేర వైసీపీ- టీడీపీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.