NTV Telugu Site icon

CM YS Jagan: గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. కలకలం సృష్టించిన ఫ్లెక్సీ!

Flexi In Nallapadu

Flexi In Nallapadu

ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు కలకలం సృష్టించింది. ‘పోరంబోకు భూమి కాపాడు జగనన్న’ అంటూ చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. నేడు సీఎం జగన్‌ నల్లపాడు రానున్నారు.

Also Read: Top Headlines@9AM: టాప్‌ న్యూస్‌!

‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. పదిన్నరకు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ కు సీఎం చేరుకోనున్నారు. శాప్ జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం ఉపన్యాసం ఇస్తారు. ఆపై క్రీడా జ్యోతిని వెలిగించి ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నమెంట్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ అవుతారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరిగి తాడేపల్లికి సీఎం చేరుకుంటారు.

Show comments