బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన సభకు తండోపతండాలుగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. అన్ని దారులు ఎల్కతుర్తి వైపే పయనమవుతున్నాయి. సభా ప్రాంగణం అంతా కళాకారుల ఆటపాటలతో మార్మోగిపోతోంది. ఈ సభలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఆ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బాటిల్స్, కర్రలు, చెప్పులతో కొట్టారు కార్యకర్తలు.
Also Read:BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ రజతోత్సవ సభ లైవ్ అప్డేట్స్..
పార్టీ మారిన 10 మంది ద్రోహుల్లారా చూడండి మిమ్ములను ఎమ్మెల్యేలుగా గెలిపించిన పార్టీ ప్రజాదరణ అంటూ సభ వద్ద ప్లెక్సీలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ ఉన్నారు.