Hyderabad: పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం.. ఇన్ స్టాలో వైరల్.. చివరకు
- పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం
- ఐదుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు
- BNS సెక్షన్ 281, 125తో పాటు మోటార్ వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ ఐదుగురు యువకులు పల్సర్ బైక్ పై నిర్లక్ష్యంగా ప్రయాణించారు. అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైఫాబాద్ సిఐ ఎ. సీతయ్య తెలిపారు.
Also Read:US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
గత నెల మార్చి 29 అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో వడ్డీ అర్జున్ (22) బైక్ నడుపుతున్నట్లు గుర్తించారు. అతనితో పాటు అరుపు రోహిత్ (19), చింతకుంట అంజ కుమార్ (19), సిద్ధం కౌశిక్ (18), వల్లపు మురళి (18) ఒకే బైక్‌పై ప్రయాణించినట్లు తేలింది.
Also Read:US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
హెల్మెట్ ధరించకుండా, బైక్ సామర్థ్యానికి మించి ఐదుగురు ప్రయాణించడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై BNS సెక్షన్ 281, 125తో పాటు మోటార్ వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐ ఎ. సీతయ్య వెల్లడించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువత సరదా కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!