Huge Amount Drugs seize: అండమాన్ జలాల్లో దాదాపు ఐదు టన్నుల బరువున్న డ్రగ్స్‌ను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ ఫిషింగ్ బోట్ నుంచి పట్టుకున్నారు అధికారులు. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు పట్టుబడిన డ్రగ్స్‌లో ఇదే అతిపెద్దది అని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకులో ఐదు టన్నుల డ్రగ్స్ ఉన్నట్లు రక్షణ అధికారులు సోమవారం తెలిపారు. అండమాన్ జలాల్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ఈ చర్య తీసుకుంది. అయితే, ఈ ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం ఇంకా అందుబాటులో లేదు. మరింత సమాచారం అందాల్సి ఉందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: IND vs AUS Test: పెర్త్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్‌లో ముందంజ
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, కార్టెల్ లను అణిచివేసేటప్పుడు యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీలు చేసిన వరుస దాడులలో ఇది తాజాది. దాదాపు 700 కిలోగ్రాముల మెథాంఫేటమిన్ (మెత్ )ను ఈ నెల ప్రారంభంలో స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరంలో భారత జలాల్లో ఎనిమిది మంది ఇరాన్ పౌరులను అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ‘సాగర్ మంథన్-4’ పేరుతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్‌ను ఎన్‌సిబి, నేవీ, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ఏడాది సముద్ర మార్గం గుండా స్మగ్లింగ్ చేస్తున్న 3,500 కిలోల డ్రగ్స్‌ను యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకుని, మూడు కేసుల్లో 11 మంది ఇరాన్, 14 మంది పాకిస్థానీ పౌరులను అరెస్టు చేశారు.
Also Read: IND vs AUS: విజయానికి అతి చేరువలో భారత్.. మరో రెండు వికెట్లు అంతే