Site icon NTV Telugu

Five Students Missing: కడపలో విషాదం.. ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు..!

Missing

Missing

Five Students Missing: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. సరదా కోసం ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు కావడంతో మల్లెపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి . బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో వేసవి సెలవులు కావడంతో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని బంధువుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వెతికినా ఆచూకీ తెలియరాలేదు.. దీంతో, మరింత ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు.. సమీపంలో చెరువు వద్దకు చేరుకొని వెతకగా గట్టుపై పిల్లల దుస్తులు కనిపించాయి. దీంతో, ఈతకు వెళ్లి గల్లంతయినట్లు ప్రాథమికంగా తెలుసుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. గజ ఈతగాళ్లను రప్పించి పిల్లలు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు రోధనలతో ఆ ప్రాంతంలో అందరి హృదయాలు బరువెక్కిపోతున్నాయి..

Read Also: Trump: సౌదీ అరేబియాలో ట్రంప్ పర్యటన.. భార్య మెలానియా లేకుండానే టూర్

Exit mobile version