Site icon NTV Telugu

Tragedy: కొత్త సంవత్సరం వేళ విషాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య

Punjab

Punjab

పంజాబ్ లో న్యూ ఇయర్ వేళ విషాదం నెలకొంది. జలంధర్ జిల్లా అదంపూర్‌లోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Venky Re Release : రీ రిలీజ్ లో సైతం కలెక్షన్ జోరు చూపించిన వెంకీ మూవీ..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. మృతుల్లో 59 ఏళ్ల మన్మోహన్ సింగ్, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల మనవరాలు ఉన్నారు. మన్మోహన్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, మిగిలిన వారు అదే గదిలో మంచంపై పడి ఉన్నారు. అయితే కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మన్మోహన్ సింగ్ సూసైడ్ నోట్‌లో రాసినట్లు జలంధర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ముఖ్వీందర్ సింగ్ భుల్లర్ తెలిపారు.

Read Also: Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ పెళ్లి..డెస్టినేషన్ వెడ్డింగ్?

ప్రాథమిక విచారణ ప్రకారం మన్మోహన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేలోపే కుటుంబ సభ్యులను గొంతుకోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. మన్మోహన్ పెద్ద కూతురు తన మైనర్ కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మరోవైపు.. మన్మోహన్ కుమారుడికి వివాహమై విదేశాల్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మన్మోహన్ అల్లుడు ఆదివారం తన భార్యకు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో వారి మృతి విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఫోన్‌ ఎత్తడం లేదని మన్మోహన్‌ అల్లుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత పోలీసులు అతనితో పాటు ఇంటికి వెళ్లగా అందులో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.

Exit mobile version