NTV Telugu Site icon

Siddipet: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం.. లెటర్‌లో ఏం రాశారంటే?

Siddipet

Siddipet

సిద్దిపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యమయ్యారు. లెటర్ రాసిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదృశ్యమైన వారిని భార్యాభర్తలు బాలకిషన్(55), వరలక్ష్మి(50), కుమారుడు శ్రవణ్ కుమార్(30), కుమారైలు కావ్య(23), శిరీష(20) గా గుర్తించారు. వీరు పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించేవారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో ఇంట్లోనే అందరి ఫోన్లు పెట్టేసి వెళ్లిపోయారు. రెండు రోజులుగా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చిన బంధువులు తాళం వేసి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డోర్ పగలగొట్టి ఇంట్లో లేటర్ కనిపించింది. బాలకిషన్ కుటుంబం అప్పుల బాధతో అదృశ్యమైననట్లు తెలిసింది.

READ MORE: Lets Live This Moment: దేవిశ్రీ మార్క్ తో ‘జూనియర్’ ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’

అయితే.. వీరబత్తిని బాలకిషన్‌కు అప్పులు ఉన్నాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి పెట్టారని బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఫోన్లు కూడా ఇంట్లోనే ఉంచడంతో ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారింది. పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.

READ MORE: Hyderabad: సూది గుచ్చకుండానే రక్త పరీక్ష రిపోర్టు.. నిలోఫర్‌లో ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్