Site icon NTV Telugu

Nagpur: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు మృతి

Blee

Blee

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. నాగ్‌పూర్‌లోని ధామ్నా గ్రామంలో పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌లో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: AP Mega DSC 2024: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అంటే..?

ప్రమాద వార్త తెలియగానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అనిల్ దేశ్‌ముష్ సంఘటన స్థలానికి చేరుకున్నారన్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి.. ఘటనకు గల కారణాలపై విచారణ జరిపించాలని పోలీసులను కోరారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Ajit Doval: మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్.. పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు

Exit mobile version