NTV Telugu Site icon

Girls Missing: ముంబైలో ఐదుగురు బాలికలు మిస్సింగ్.. వెతుకులాటలో పోలీసులు

Missing

Missing

మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతంలో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. కాగా.. మిస్సింగ్ అయిన బాలికల కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. తలోజా ప్రాంతంలోని లక్కీ కాంప్లెక్స్‌లో బాలికలు శనివారం అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి బాలికలను వెతికే పనిలో పోలీసులు నిమగ్నం కాగా.. మరోవైపు బాలికల తల్లిదండ్రులు తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయారు.

Read Also: PM Modi: దర్యాప్తు సంస్థలపై విపక్షాల విమర్శలకు మోడీ కౌంటర్

కాగా.. శనివారం రోజున ఇద్దరు బాలికలు 14 సంవత్సరాలు ఒకరికి.. మరోకరికి 16 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు. ఉదయం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తలోజా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మరొక చోట ఐదు, ఏడు, 14 ఏళ్ల వయసున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు తలోజాలో నివాసముండే తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని బాలికల ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Read Also: PM Modi: వెయ్యేళ్ల అభివృద్ధికి పునాదులు వేస్తాం..