Srisailam Dam Gates Lifted: ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర నుంచి క్రమంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది.. దీంతో.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి.. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. సోమవారం సాయంత్రం 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు.. ఈ రోజు మరో రెండు గేట్లను ఎత్తివేశారు.. దీంతో.. శ్రీశైలం జలాశయం 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.. ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు..
Read Also: Asia Cup 2025-India: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం.. టీ20 ఫార్మాట్‌లో టోర్నీ!
ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 4,42,441 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఐదు గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తడంతో పాటు.. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కలుపుకొని.. మొత్తం 1,95,457 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.. ఇక, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిటమటం 885 అడుగులు కాగా… ప్రస్తుతం నీటిమట్టం 882.50 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు.. అయితే, ప్రస్తుతం ప్రాజెక్టులో 201.5822 టీఎంసీలు నీరు ఉంది.. మరోవైపు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలోవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు అధికారులు.. అయితే, ఇన్‌ఫ్లో మరింత పెరిగితే.. మరిన్ని గేట్లను కూడా ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు.. ఎప్పటికప్పుడు.. ఇన్‌ఫ్లోను నిషితంగా పరిశీలిస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు.. ఇక, శ్రీశైలం డ్యామ్ నుంచి కిందకు దూకుతూ పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. ఓవైపు ఏపీ నుంచి.. మరో వైపు తెలంగాణ నుంచి.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు శ్రీశైలం వెళ్తున్నారు..