Road Accident: శ్రీరామనవమి ఏర్పాట్లలో అపశృతి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసులు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అయితే, శ్రీరామనవమి పండుగ జరుపుకునేందుకు కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన చామదలకు వచ్చారు. పండుగకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసేందుకు కావలికి వెళ్తుండగా వారిని మృత్యువు వెంటాడింది.. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇటీవలే కారును కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, శ్రీరామ నవమి పండుగ సమయంలో ఓకే కుటుంబంలో ఐదుగురు మృతిచెందడం.. ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది..
Read Also: Shiromundanam Case: శిరోముండనం కేసులో సంచలన తీర్పు.. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష..
Also Read
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..