NTV Telugu Site icon

Road Accident: శ్రీరామనవమి ఏర్పాట్లలో అపశృతి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Road Accidnt

Road Accidnt

Road Accident: నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసులు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అయితే, శ్రీరామనవమి పండుగ జరుపుకునేందుకు కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన చామదలకు వచ్చారు. పండుగకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసేందుకు కావలికి వెళ్తుండగా వారిని మృత్యువు వెంటాడింది.. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇటీవలే కారును కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, శ్రీరామ నవమి పండుగ సమయంలో ఓకే కుటుంబంలో ఐదుగురు మృతిచెందడం.. ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది..

Read Also: Shiromundanam Case: శిరోముండనం కేసులో సంచలన తీర్పు.. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష..