Site icon NTV Telugu

Legislative Council : శాసనమండలిలో ఐదు బిల్లులు ఆమోదం

Telangana Assembly

Telangana Assembly

రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లు (టిమ్స్) 2023తో సహా ఐదు ముఖ్యమైన బిల్లులను శాసన మండలి ఆదివారం ఆమోదించింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లు (టిమ్స్), 2023, తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, 2023ని ఆరోగ్య, ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ప్రవేశపెట్టారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ (సవరణ)ను ప్రవేశపెట్టారు.

Also Read : Pawan Kalyan: మల్లవల్లి రైతులకు పరిహారం అందేవరకు జనసేన పోరాటం చేస్తుంది

బిల్లు, 2023, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండవ సవరణ) బిల్లు, 2023, కార్మిక మంత్రి సిహెచ్. మల్లారెడ్డి ఫ్యాక్టరీల (తెలంగాణ సవరణ) బిల్లు, 2023ని ప్రవేశపెట్టారు. మొత్తం ఐదు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 10,000 హాస్పిటల్‌ పడకలను రూపొందించి, రానున్న కాలంలో 50,000 పడకలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి టీ హరీష్‌రావు ఆదివారం శాసనమండలికి తెలిపారు. కౌన్సిల్‌లో ప్రవేశపెట్టిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) యాక్ట్ 2022 ముఖ్య లక్షణాలను వివరిస్తూ, ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల నాలుగు 1000 పడకల టిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.

Also Read : Uttar Pradesh: దారుణం.. అబ్బాయిలతో బలవంతంగా మూత్రం తాగించి.. ప్రైవేట్‌ పార్ట్‌లో మిరపకాయలు రుద్ది..

Exit mobile version