NTV Telugu Site icon

Arunachal Pradesh: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం..

Minor Girl

Minor Girl

సమాజంలో రోజు రోజుకు అత్యాచార ఘటనలు మితిమీరిపోతున్నాయి. దేశం నలుమూలల ఎక్కడో చోట కామాంధులు అమాయక ఆడపిల్లలపై దారుణానికి ఒడిగడుతున్నారు. ఇలాంటి మృగాలకు ఎన్ని శిక్షలు వేసినా.. మళ్లీ పుట్టుకొస్తున్నారు. తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబంసిరి జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. నిందితులను అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

Read Also: Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధుల భేటీ

ఈ ఘటనపై అప్పర్ సుబంసిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) థుటన్ జాంబా మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు బాలికపై ఐదుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. గత నెల జూలైలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జూలై 28న పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని ఎస్పీ థుటన్ జాంబా చెప్పారు.

Read Also: క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ.. ప్రేక్షకుల్ని నవ్విస్తుంది – రమ్య పసుపులేటి ఇంటర్వ్యూ

జూలై 28న బాలికను రక్షించి.. వైద్య పరీక్షల అనంతరం ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరిని జూలై 29న అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగతా నలుగురు నిందితులను కూడా గత వారం అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 137(2), 70(2), మరియు 3(5) సెక్షన్‌లు.. లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే (POCSO) చట్టంలోని సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేశారు.