క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ.. ప్రేక్షకుల్ని నవ్విస్తుంది – రమ్య పసుపులేటి ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramya Pasupuleti Interview for Maruthi Nagar Subramanyam: రావు రమేష్, ఇంద్రజ జంటగా, రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య, అతని సరసన రమ్య పసుపులేటి నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతోన్న సందర్భంగా రమ్య పసుపులేటి మీడియాతో మాట్లాడారు. ఆవిడ చెప్పిన విశేషాలు…
రమ్య బ్యాక్ గ్రౌండ్
నాకు నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి యాడ్స్ చేస్తున్నాను. అనుష్క గారి ‘పంచాక్షరీ’లో బాలనటిగా చేశా. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ‘స్పైడర్’లోనూ ఓ రోల్ చేశా. ఆ తర్వాత చదువుకోవాలని గ్యాప్ తీసుకున్నాను. బ్యాచిలర్స్ ఫినిష్ చేసి సినిమాల్లోకి వచ్చాను. ప్రజలకు రీచ్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ హెల్ప్ అయ్యింది.
Also Read
- Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
- Dhanush - Aishwaryaa: ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
- The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
- Ranbir Kapoor: ట్రోలర్లకు స్వీట్ షాక్.. తనపై తానే జోక్ వేసుకొని నవ్వించిన రణ్‌బీర్ కపూర్!
‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’లో మీకు అవకాశం ఎలా వచ్చింది?
దర్శకుడు లక్ష్మణ్ కార్య గారు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశారట. ఈ అమ్మాయిని పిలవండి, ఆడిషన్ చేద్దామని టీమ్ మెంబర్లతో చెప్పారు. ఆఫీస్ కి వెళ్ళాక ఆడిషన్ చేశారు. నా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు. చాలా రోజుల తర్వాత మంచి అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యాను.
కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
నవ్వించడం కష్టం. ప్రేక్షకులను నవ్వించగలిగితే క్యారెక్టర్ పండినట్లు. ఇందులో నా పాత్ర ద్వారా నవ్వించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన వాళ్ళు అందరికీ నా రోల్ నచ్చుతుంది.
గ్లామర్, ట్రెడిషనల్… రెండు విధాలుగా కనిపిస్తున్నారు!
‘మేడమ్ సార్ మేడమ్’ సాంగ్ చూస్తే… నన్ను అన్ని విధాలుగా చూపించారు. నేను 18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి రోల్ చేశా. క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ ఉంటుంది. గ్లామర్, ట్రెడిషనల్… రెండు విధాలుగా కనిపిస్తా.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
బబ్లీ, క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయి. కొంచెం తింగరితనం ఉంటుంది. కానీ, చాలా నవ్విస్తా. నాకు కామెడీ చేయడం చాలా ఇష్టం. ఎమోషన్స్ కూడా బాగా చేస్తా.
అంకిత్ కొయ్యతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్?
వెరీ అమేజింగ్ కో యాక్టర్. వ్యక్తిగతంగా మనిషికి హెల్ప్ చేసే పర్సనాలిటీ. నటుడిగా ఎలా చేస్తాడో ‘ఆయ్’లో చూశాం. వండర్ ఫుల్ యాక్టర్. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి.
‘మేడమ్ సార్ మేడమ్’ పాటకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఊహించారా?
అవును… ముందు ఊహించాను. మా దర్శకుడు లక్ష్మణ్ కార్య ట్యూన్ వినిపించారు. పాట వినిపించమంటే… విడుదల అయ్యే ముందు రోజు వరకు చూపించలేదు. ఆ పాట ట్యూన్ విన్నప్పుడు నచ్చింది. సిద్ శ్రీరామ్ పాడుతున్నారని తెలిశాక పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.
రావు రమేష్, ఇంద్రజ వంటి సీనియర్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది?
మొదట భయం వేసింది. నేను కంఫర్టబుల్‌గా ఉండేలా వాళ్ళు చూసుకున్నారు. ఓ రోజు సీన్ అయ్యాక రావు రమేష్ గారు ‘బాగా చేశావమ్మా’ అన్నారు. ఆ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంద్రజ గారు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు. ఆవిడ చాలా ప్రెట్టిగా ఉంటారు. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్.
తాజావార్తలు
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
-
Dhanush – Aishwaryaa: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
Hyderabad: మద్యం మత్తులో ఘర్షణ.. ఫంక్షన్ హాల్లో వ్యక్తి హత్య.!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి