NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. తెలంగాణలో ఎంతమందంటే!

First

First

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది.

 

జహీరాబాద్‌ – సురేశ్‌ షెట్కర్

చేవెళ్ల – సునీతా మహేందర్‌రెడ్డి

నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి

మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌

 

కేవలం నలుగురి అభ్యర్థులనే అధిష్ఠానం ఖరారు చేసింది. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు  కానీ ఆయన పేరును హోల్డ్‌లో పెట్టింది. కారణమేంటో తెలియదు.

 

గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు జైరాం రమేశ్‌, అధీర్‌రంజన్‌ చౌధరి, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్‌, టీఎం సింగ్‌దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.