NTV Telugu Site icon

Godavari Floods: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్

Badrachalam

Badrachalam

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న వరదలతో తెలంగాణ ఎగువన వున్న వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో ఎగువ నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకుల గూడెంతో పాటు ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల వాసులను అధికారులు అలెర్ట్ చేశారు.

Read Also: CM Revanth: ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..

అయితే 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాదం జారీ చేస్తారు. కాగా ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీగా వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. ప్రస్తుతం శబరి 38 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రారంభమైంది. దీంతో గోదావరి స్పీడ్ తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి కొద్ది మేరకు పెరుగుతున్నది. ఇది మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు హెచ్చరికల్ని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

Read Also: YS Jagan: ఏపీ గవర్నర్‌తో మాజీ సీఎం జగన్ భేటీ