NTV Telugu Site icon

Mallareddy University: మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డే కార్యక్రమం..

Malla Reddy

Malla Reddy

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫస్ట్ కాన్వకేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూనివర్సిటీ ఫౌండర్ (చైర్మన్) మల్లారెడ్డి, రిజిస్టార్ అంజనేయులు, వైస్ చైన్సలర్ విఎస్.కె రెడ్డితో పాటు యూనివర్సిటీ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రవీణ్ రెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Read Also: Purandeshwari: ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ హర్షణీయం..

ఈ సందర్భంగా చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, డిజిటల్ పాలిటిక్స్ లలో కలిపి మల్లారెడ్డి యూనివర్సిటీ నుండి మొదటి బ్యాచ్ బయటకి వెళ్లడం, ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులందికి లక్షల ప్యాకెజ్ తో జాబ్స్ సాధించడంతో తన జీవితమే ధన్యమైందన్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ లు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు ప్రైవేట్ పరంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కుడా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మల్లారెడ్డి యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండే రోజులు తీసుకొస్తామని మల్లారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read Also: UK: యూకే ఎన్నికల్లో మహిళల సరికొత్త రికార్డ్