Pakistan Army: ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్ లో ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. పాక్ లో మెడికల్ కార్ప్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్ ర్యాంక్ సాధించిన క్రైస్తవ, మైనారిటీ కమ్యూనిటీ నుంచి మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. హెలెన్ మేరీ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. సెలక్షన్ బోర్డ్ ద్వారా బ్రిగేడియర్, ఫుల్ కల్నల్‌గా పదోన్నతి పొందిన పాకిస్తానీ ఆర్మీ అధికారులలో బ్రిగేడియర్ హెలెన్ కూడా ఉన్నారు. హెలెన్‌కు బ్రిగేడియర్‌గా పదోన్నతి లభించినందుకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. దేశం మొత్తం ఆమె గురించి గర్విస్తోందని, ఆమె వంటి మైనారిటీ వర్గాలకు చెందిన వేలాది మంది కష్టపడి పనిచేసే మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. పాక్ ప్రధాని అభినందనలు తెలిపారు బ్రిగేడియర్ డాక్టర్ హెలెన్ సీనియర్ పాథాలజిస్ట్ గా గత 26 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. గత సంవత్సరం, రావల్పిండిలోని క్రైస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ దేశ అభివృద్ధిలో మైనారిటీ కమ్యూనిటీ పోషించిన పాత్రను ప్రశంసించారు.
Read Also: Stock Markets: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రభావం.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు