NTV Telugu Site icon

AP Cabinet : ప్రారంభమైన ఏపీ కేబినెట్‌ సమావేశం

Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. సూపర్‌-6 పథకాల అమలుపై కేబినెట్‌ చర్చించనుంది. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల ఫైళ్లను ఆమోదించనుంది కేబినెట్‌. అన్న క్యాంటీన్లకు ఇప్పటికే రూ. 164 కోట్ల కేటాయింపు. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించే అంశంపై కేబినెట్లో చర్చ జరుగనుంది. హామీ మేరకు పెంచిన పెన్షన్లను వచ్చే నెల నుంచి అమల్లోకి తేనున్న ఏపీ ప్రభుత్వం. రూ. 4 వేల పెన్షనుతో పాటు పెండింగులో ఉన్న రూ. 3 వేలను పంపిణీ చేయనుంది.

వచ్చే నెల రూ. 7 వేల పెన్షన్ అందుకోనున్నారు లబ్దిదారులు. పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేసేలా ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించనున్నారు మంత్రి వర్గం. మెగా డీఎస్సీ ప్రక్రియపై స్టేటస్ రిపోర్ట్ తీసుకోనున్న కేబినెట్‌.. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించనుంది విద్యా శాఖ. గత ప్రభుత్వ అక్రమాలపై కీలక చర్చ జరపనుంది తొలి కేబినెట్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శ్వేత పత్రాల విడుదల వంటి అంశాలపై మంత్రి వర్గం చర్చించనుంది. అయితే.. రూ. 14 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది ఆర్ధిక శాఖ. ఈ నేపథ్యంలో.. శ్వేత పత్రాల రూపకల్పనకు నలగురు మంత్రులతో కమిటీ వేసే అంశంపై చర్చించనున్నారు. వైట్ పేపర్ కమిటీలో మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, అనిత, అనగాని ఉండే ఛాన్స్. మంత్రుల కమిటీ నియామకంపై ఇవాళ కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోనుంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికపై కేబినెట్‌లో కీలక ప్రస్తావన రానుంది. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు, డయేరియా కట్టడి, అగ్రీగోల్డ్ బాధితులు, శాంతి భద్రతలు, డ్రగ్స్ కట్టడి వంటి అంశాలపై చర్చించనుంది మంత్రి వర్గం. పవన్ కళ్యాణ్ లేవనెత్తే అంశాలపై ఆసక్తి నెలకొంది.