Site icon NTV Telugu

Bihar: బీహార్లో కాల్పుల కలకలం.. బీజేపీ నేత సహా ఇద్దరు హత్య

బీహార్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుడు బీజేపీ నగర అధ్యక్షుడు ఫంతుష్‌ కుమార్‌ అలియాస్‌ బంటీ సింగ్‌ గా గుర్తించారు. బీజేపీ నాయకుడు తన కుమారుడితో కలిసి నిద్రిస్తున్న సమయంలో దుండగులు కాల్చారని స్థానికులు చెబుతున్నారు. ఉదయం మంచంపై పడి ఉన్న మృతదేహాన్ని చూసి చలించిపోయామని చెప్పారు. కచ్చి కన్వారియా బాటలో బీజేపీ నేత టీ-స్నాక్‌ల దుకాణం నడిపేవారని ప్రజలు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు, కారణం ఏమై ఉంటుందని పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: Sachin Tendulkar: మీరు మా హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.. ప్రీతి, నిషాద్‌లకు సచిన్ అభినందనలు

మరోవైపు.. ధర్హరా, ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో.. వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో.. ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని.. కొంత మందిని విచారించాల్సి ఉందని తెలిపారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హంతకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా’ను సరిపెడుతున్న భారీ వర్షాలు??

మరో ఘటనలో బౌచాహి గ్రామం సమీపంలో బొలెరో డ్రైవర్ తలపై గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. అనంతరం.. NH 80లో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బొలెరో డ్రైవర్ బెగుసరాయ్ జిల్లా మతిహాని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Exit mobile version