ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లాయర్లు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: TS SSC Results 2024: విద్యార్థులు అలర్ట్.. రేపు ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు..
పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో న్యాయవాదులకు చెందిన ఛాంబర్ దగ్ధమైంది. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా?, ఎంత నష్టం జరిగింది అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యాయవాదులకు సంబంధించిన పలు వస్తువులు అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Online Fraud: ఆన్ లైన్ లో కేటుగాళ్లు చైన్ బిజినెస్.. కాస్ట్ కో లింకు తో టార్గెట్
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు కారణంగా ఆయా ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరగుతున్నాయి. అయితే లాయర్ల ఛాంబర్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.
#WATCH | Uttar Pradesh: Fire breaks out in the lawyers' chamber outside the district and sessions court of Jalaun. Fire tenders are at the spot to douse the fire. pic.twitter.com/DIVGdF0rm0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 29, 2024