NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం…

Fire Accident

Fire Accident

హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్ బాగ్ కార్పోరేటర్, కాలాపత్తర్ ఇన్స్‌పెక్టర్, బహదూర్ పురా పోలీసులు వెంటనే స్పందించారు. కిషన్‌బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలోని ఓ బిల్డింగు సెల్లార్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అది కాస్త పైపునకు పాకింది. అగ్ని ప్రమాదం వల్ల భవనంపై అంతస్తు్ల్లోనూ దట్టమైన పొగ అలుముకుంది. దాంట్లో ఉన్న కొందరిని కాలాపత్తర్ సీఐ, కిషన్ బాగ్ కార్పోరేటర్, స్థానికులు కిందికి దింపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు.

READ MORE: Ajith Kumar : ‘విడాముయార్చి’ అడ్వాన్స్ బుకింగ్స్ అవుట్ స్టాండింగ్

ఇదిలా ఉండగా.. భాగ్యనగరంలో అగ్నిప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నిజాంపేట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్ లో గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు వ్యాపించగా పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఒక షాపు నుంచి మరో షాపుకు మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు . ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి తీసుకున్నారు.

READ MORE: Priyanka Gandhi : కేజ్రీవాల్ తో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీ