NTV Telugu Site icon

AP Secretariat: ఏపీ సచివాలయంలోని పవన్ కళ్యాణ్ ఛాంబర్ వద్ద అగ్నిప్రమాదం?

Ap Secretariat

Ap Secretariat

ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది.

READ MORE: KKR vs SRH: బ్యాటు ఝుళిపించిన వెంకటేష్ అయ్యర్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే?

సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనితల పేషీలు(ఛాంబర్లు) ఉన్నాయి. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరు లోపల లేరని సమాచారం.

READ MORE: KKR vs SRH: బ్యాటు ఝుళిపించిన వెంకటేష్ అయ్యర్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే?