Site icon NTV Telugu

Hyderabad: పహాడీ షరీఫ్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident

Fire Accident

రాచకొండ కమిషనరేట్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి మండపాలలో డెకరేషన్ కు ఉపయోగించే సామగ్రి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలను గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గోదాం వద్దకు వెళ్లి చూడటంతో అప్పటికే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. విషయాన్ని పహాడ్ షరీఫ్ పోలీసులకు చెప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు అదుపు చేశారు. అప్పటికే స్థానికంగా ఉండే కొందరు గోదాంలో నుంచి సామాన్లను బయటకు చేర్చే ప్రయత్నం చేశారు.

READ MORE: Vladimir Putin: ఇరాన్ అణ్వాయుధాలను కోరుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు..

అప్పటికే.. గోదాంలో చాలా సామగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. గోదాంలో మంటలు అంటుకోవడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని స్థానికులు అంటున్నారు. గోదాంలో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందా లేదా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.. తమకు బస్తీలో ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎవరూ సమయానికి స్పందించడం లేదని అంటున్నారు. ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామన్నారు. అధికారులకు సమాచారం అందించిన గంటన్నరకు ఇక్కడికి చేరుకున్నారని ఆరోపించారు.

Exit mobile version