NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: కుంభమేళా ప్రాంతంలో మళ్లీ మంటలు.. రెండు వాహనాలు దగ్ధం

Kumb

Kumb

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో అక్కడ జొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే, సకాలంలో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక అధికారులు. సమాచారం ప్రకారం.. కుంభమేళా ప్రాంతంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం వల్ల పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలో ఆగి ఉన్న రెండు వాహనాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో చాలా సేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Also Read: Dead Body On Bicycle: సైకిల్‌పై 15 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు

అయితే, ఘటన నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ఏకాదశి కావడంతో ఈరోజు మహాకుంభానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. గతంలో జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా కుంభ్ నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అగ్నిప్రమాదాలు, ప్రమాదాల నివారణకు కుంభమేళాలో పలు చోట్ల స్పాట్‌లు ఏర్పాటు చేశారు. తద్వారా ఏదైనా సంఘటన జరిగితే సత్వరమే స్పందించవచ్చు.

Also Read: Mamatha Kulakarni: మహా కుంభమేళా‌లో సన్యాసం తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్..

ఈ కారణంగా, ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అగ్నిమాపక దళం సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే కారులోని వ్యక్తులను ఖాళీ చేయించి మంటలను అదుపులోకి తెచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, వాహనాలను ఇక్కడే పార్క్ చేశారని ఫైర్ ఆఫీసర్ విశాల్ యాదవ్ తెలిపారు. అయితే ఇక్కడ విపరీతమైన వేడి కారణంగా మంటలు చెలరేగాయని, అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని తెలిపారు. ఈ ఘటనలో ఓ ఎర్టిగా కారు పూర్తిగా, ఓ వెన్యూ కారు పాక్షికంగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.