Site icon NTV Telugu

Fire Accident: ఢిల్లీలోని బాంక్వెట్‌ హాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Fire Accident

Fire Accident

Fire Accident: ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఓ బాంక్వెట్ హాల్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటలకు అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక శాఖ అధికారులకు కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సెక్టార్‌-3లోని ఘటనాస్థలికి చేరుకున్నారు.

Monkey Video: అన్నంపెట్టిన వ్యక్తి మృతి.. కన్నీళ్లు పెట్టుకొని నివాళులు అర్పించిన కోతి

ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, బాంకెట్ హాల్‌లో ఎవరూ చిక్కుకున్నట్లు సమాచారం లేదు. గంటల తరబడి మంటలార్పేందుకు ప్రయత్నించిన అధికారులు.. ఎట్టకేలకు వాటిని అదుపుచేశారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Exit mobile version